● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమకేసులు పెడితే ఊరుకోం
● వైఎస్సార్‌సీపీజిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి
కడప అర్బన్: ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులతో.. అరెస్టులతో వేధిస్తున్నా రని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. ఈ విషయమై కడపలో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌ను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరుగుతున్న అక్రమ అరెస్టులు, కేసులు, బైండోవర్ల అంశాలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పి. రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. పత్రికల్లో వచ్చిన వార్తలను సోషల్ మీడియా గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసినంత మాత్రాన కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచారనే కారణంతో పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీస్ స్టేషన్లకు పిలిపించి బైండోవర్ చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు మాత్రమే ఉంటుందన్నారు. రాబోయేకాలంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తుందన్నారు. ప్రస్తుతం తమ కార్యకర్తలను, నాయకులను ఇబ్బందులకు గురిచేసిన అధికారుల సర్వీసు మరో ఇరవై ఏళ్లు, ముప్పై ఏళ్లు ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదన్నారు. మైదుకూరులో పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు.వాస్తవ సంఘటనను, అన్ని పత్రికల్లో, మీడియాలో వచ్చిన సంఘటనను తమ స్థానిక ప్రజల గ్రూప్‌లో పోస్టు చేశాడనీ కక్షపూరితంగా వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నేటపల్లి శివరామకృష్ణపై అక్రమంగా కేసును బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఫార్వర్డ్ చేయడం నేరమా?
శివరామకృష్ణపై ఇప్పటికే ఒకసారి కేసులను బనాయించారని, దాదాపు 40 నుంచి 50 రోజులపాటు జైలులో ఉండి వచ్చారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తమను అడ్డుకుంటారని టీడీపీ శ్రేణులు భావించి ఇలాంటి కుట్రలతో అక్రమకేసులను బనాయించారన్నారు. ఈ కేసు విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
– మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 11న మైదుకూరు మండలం జి.వి సత్రంలో పాఠశాలలో స్మార్ట్‌కిచెన్‌లో బల్లిపడిన విషయం తెలిసి పప్పును పారబోశారన్నారు. తరువాత ఎమ్మార్వో, ఎంపీడీఓ ఇతర అధికారులు వచ్చిన సమయానికి ఐదుగురు విద్యార్థులను స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌ను ఇప్పించారన్నారు. స్మార్ట్‌కిచెన్‌లో ప్రభుత్వం నియమించిన వారే ఉన్నారన్నారు. వారిపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై అన్ని టీవీ ఛానెళ్లలో, పత్రికల్లో ప్రచురితమైందన్నారు. వాట్సాప్‌గ్రూప్‌లో వచ్చిన విషయాన్ని శివరామకృష్ణ పోస్ట్ చేశారని అక్రమంగా కేసులను బనాయించారన్నారు. కేవలం టీడీపీ వారి కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేశారని కడపలోని జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించామన్నారు. వాస్తవాలను విచారిస్తే అన్యాయంగా కేసు బనాయించారని తెలుస్తుందనీ శివరామకృష్ణ పేరును ఎఫ్‌ఐఆర్ నుంచి తొలగించాలనీ విజ్ఞప్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మాజీమేయర్ పాకా సురేష్‌కుమార్, పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్‌కుమార్, రాష్ట్ర బీసీ విభాగం నాయకులు ఆదిమూలం శివయ్యయాదవ్, పార్టీ మైదుకూరు మండల ప్రధాన కార్యదర్శినేట్లపల్లి రామాంజనేయులు యాదవ్ పాల్గొన్నారు.


