వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బలవన్మరణం

Sep 16 2026 3:43 AM | Updated on Sep 16 2026 3:43 AM

చింతకొమ్మదిన్నె : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బలవన్మరణం చెందారు. చింతకొమ్మదిన్నె మండలంలోని రోడ్డు క్రిష్ణాపురం గ్రామంలో రాగినూతుల రెడ్డయ్య(43) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ బాల మద్దిలేటి తెలిపిన వివరాల మేరకు.. రెడ్డయ్య తిరుపతి ప్రాంతం నుంచి రోడ్డు కృష్ణాపురానికి ఇల్లరికపు అల్లుడిగా వచ్చి లారీ ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. నెల రోజుల కిందట పెద్ద కూమార్తె వివాహం చేశాడు. ఇల్లు నిర్మాణ క్రమంలో అప్పులు ఎక్కువ కావడం, దీంతో భార్యాభర్తల మధ్య కలహాలు రావడంతో మంగళవారం మధ్యాహ్నం.. భార్య పక్క వీధిలో గల ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లినపుడు, ఇంట్లో గడియ పెట్టుకుని బెడ్‌ రూములో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మద్యానికి బానిసై..

బద్వేలు అర్బన్‌ : మండల పరిధిలోని చింతలచెరువు పంచాయతీ శ్రీనివాసపురం గ్రామానికి చెందిన పొన్నా వెంకటేష్‌(30) సోమవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీనివాసపురం గ్రామానికి చెందిన వెంకటేష్‌ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తుండేవాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా భార్యతో గొడవ పడి ఇంట్లోని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అయితే ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య కిటికీలో నుంచి గమనించగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే స్థానికులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి తలుపులు పగులకొట్టి వెంకటేష్‌ను బద్వేలులోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి రోశయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ చిరంజీవి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి ఆవరణలోని శవపరీక్ష గదికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement