వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య

Sep 16 2026 3:43 AM | Updated on Sep 16 2026 3:43 AM

మైదుకూరు : మండలంలోని బసవాపురం జగనన్న కాలనీకి చెందిన మీసాల సుబ్రహ్మణ్యం(45) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే సుబ్రహ్మణ్యంకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా కుమారుడు రాజంపేట ప్రాంతంలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. సుబ్రహ్మణ్యం మద్యానికి బానిసై రోజూ తాగుతూ ఉండగా భార్య స్వర్ణలత మందలించేది. గుండె జబ్బుతో బాధపడుతున్న నీవు రోజు మద్యం తాగితే ఎలా అంటూ వాపోయేది. సుబ్రమ్మణ్యం తన ధోరణి మానుకోకపోవడంతో ఆమె నాలుగు నెలల కిందట నెల్లూరులో ఉన్న తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో అతను ఒంటరిగా ఉంటూ ఇంకా ఎక్కువ మద్యం తాగుతూ జీవితంపై విరక్తి చెంది ఆదివారం రాత్రి గడ్డి మందును తాగాడు. సుబ్రహ్మణ్యం తమ్ముడు నాగేంద్ర ప్రసాద్‌, మరదలు నాగసుబ్బమ్మ చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కడప రిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. మృతుడి కుమారుడు మంజునాథ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కేసు నమోదు

వేంపల్లె : వేంపల్లెలోని ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తిరుపాల్‌ నాయక్‌ తెలిపారు. ఆదివారం రాత్రి డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డులపై వేంపల్లెకు చెందిన రోహిత్‌తోపాటు మరో ఐదుగురు వ్యక్తులు ఆసుపత్రి వద్దకు వెళ్లి అర్ధరాత్రి దాడి చేసినట్లు సెక్యూరిటీ గార్డులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సెక్యూరిటీ గార్డుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement