వేంపల్లె : నారికేళ వినాయక..
ప్రొద్దుటూరు కల్చరల్ : శివలింగాల గణపతి
ఏకదంతుడు ఊరూవాడా కొలువుదీరాడు.. బహురూపాల్లో దర్శనమిచ్చాడు..
జగమంతా వెలుగులు పంచి ఆది దేవుడై ఆశీర్వదించాడు. జిల్లావ్యాప్తంగా సోమవారం వినాయక చవితి వేడుకలు సంబరంగా సాగాయి. కళ్లు చెదిరి మండపాల సెట్టింగులతో.. సాంస్కృతిక కార్యక్రమాలతో చవితి వేడుకలు ఆద్యంతం వైభవంగా సాగాయి. మంగళవారం రోజు వినాయక మండపాల వద్ద అన్నదానాలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కడపలో ఎస్పీ నచికేత్ గణపయ్యను దర్శించుకున్నారు. నిమజ్జనంలో తీసుకునే చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
గణపయ్యకు ‘ఆధార్’
పేరు: శ్రీ గణేష్, తండ్రి పేరు: శివుడు,
చిరునామా: నాగిరెడ్డిపల్లి.
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మదర్ థెరిసా వీధి యువత ఇలా వినూత్నంగా ఆలోచించారు. గణపయ్యకు ఆధార్, పాన్ కార్డు థీమ్‌తో మండపాన్ని తీర్చిదిద్దారు. – నందలూరు


