కడప అర్బన్ : వైద్య వృత్తి సేవకు ప్రతిరూపమని వైద్యాధికారులు తెలిపారు. కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాల(రిమ్స్)లో 2026 సంవత్సరానికి గాను ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులకు మంగళవారం ఘనంగా స్వాగత కార్యక్రమం, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ నాగశ్రీలత, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ పద్మజ పాల్గొని విద్యార్థులకు తమ సందేశాలను అందించారు. అదే విధంగా అన్ని విభాగాల హెచ్‌ఓడీలు, ఫ్యాకల్టీ సభ్యులు హాజరై కొత్తగా ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులకు వైద్య విద్య, క్రమశిక్షణ, భవిష్యత్ కెరీర్ పై తగు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొని తమ అభిప్రాయాలు, మనోభావాలను వ్యక్తం చేశారు.


