కడప అర్బన్: వైఎస్‌ఆర్ ఉమ్మడి కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జి.రామ గోపాల్‌ను కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూ రి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కూడా జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిశారు.
లోక్ అదాలత్‌లో 92,091 కేసుల పరిష్కారం
● రాష్ట్రస్థాయిలో కడప జిల్లాకు
రెండో ర్యాంక్
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
జి.రామగోపాల్
కడప అర్బన్: జాతీయ లోక్ అదాలత్‌లో వైఎస్‌ఆర్ ఉమ్మడి కడప జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకమైన రెండో ర్యాంకు సాధించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామగోపాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 29 బెంచీలలో మొత్తం 92,091 కేసులు విజయవంతంగా పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. వీటిలో 91,236 క్రిమినల్ కేసులు, 201 సివిల్ కేసులు, 654 ప్రీ–లిటిగేషన్ కేసులు ఉన్నాయి. ఈ రాజీ మార్గాల ద్వారా కక్షిదారులకు రూ. 22,11,42,448 మొత్తాన్ని చెల్లించినట్లు ఆయన వివరించారు. కేసుల త్వరితగతిన పరిష్కారానికి సహకరించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


