ఘనంగా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు

Aug 28 2026 1:51 AM | Updated on Aug 28 2026 1:51 AM

పులివెందుల రూరల్‌ : కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పులివెందుల పట్టణంలోని బ్రాహ్మణపల్లి రోడ్డు చౌడమ్మ దేవాలయంలో మాజీ కౌన్సిల్‌ కోడి రమణ, వైఎస్సార్‌సీపీ నాయకుడు రాయుడు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు మున్సిపల్‌ ఇన్‌ఛార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు చవ్వా దుష్యంత్‌రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చౌడమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడి రమణ ఏర్పాటు చేసిన 42 కేజీల కేకును వైఎస్‌ మనోహర్‌ రెడ్డి దుష్యంత్‌రెడ్డితో కలిసి కట్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. పట్టణంలోని భాకరాపురంలో ఉన్న వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిషోర్‌ ఆధ్వర్యంలో చీరెల పంపిణీ, కేక్‌ కటింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్య మహిళా కార్మికులు, విభిన్న ప్రతిభావంత మహిళలకు చీరల పంపిణీ కేక్‌ కటింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్‌ ఇన్‌ఛార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత దుష్యంత్‌రెడ్డి హాజరై చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వరప్రసాద్‌ మార్కెట్‌, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ చిన్నప్ప, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు రసూల్‌, కనక, రెడ్డి, చందు, మల్లి, రాజేష్‌, సంపత్‌, రవి, ప్రదీప్‌, శేఖర్‌ నాయుడు, చంద్రమౌళి, దాసరి చంద్రమౌళి పాల్గొన్నారు. అలాగే పులివెందుల లోని ఎరగ్రుడి పల్లెలో వైఎస్సార్‌సీపీ నాయకులు కోళ్ల భాస్కర్‌, సూరి, కృష్ణమూర్తిల ఆధ్వర్యంలో కేక్‌ను కట్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని దుష్యంత్‌రెడ్డి ప్రారంభించారు.

నల్లపురెడ్డిపల్లె, ఎర్రిపల్లెలలో జన్మదిన వేడుకలు

పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, ఎర్రిపల్లె గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు అజ్జుగుట్ట భాస్కర్‌రెడ్డి, రామమల్లేశ్వరరెడ్డి, ఉమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అలాగే ఎర్రిపల్లె గ్రామంలో మార్కెట్‌ యార్డు మాజీ వైస్‌ చైర్మన్‌ సర్వోత్తమరెడ్డి, యూత్‌ నాయకుల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో అంబకపల్లె బాబురెడ్డి, రాజశేఖర్‌, భార్గవి, ప్రసన్నలక్ష్మీ, అరుణ కుమారి, సంపత్‌, రాజా, జయరాం, రాజా, గంగిరెడ్డి, రిషికేశవరెడ్డి, ఫకృద్దీన్‌, శ్రీరాములు, పాపయ్య, రవి, మధు, చిన్న, గంగరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement