విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Aug 28 2026 1:51 AM | Updated on Aug 28 2026 1:51 AM

చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని బాబానగర్‌ కు చెందిన పబ్బులేటి భాస్కర్‌ కుమారుడు పబ్బులేటి ధనుంజయ (23) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి కథనం మేరకు... ధనుంజయ గురువారం తెలుగుగంగ కాలనీ సమీపంలోని ఓ ఇంటికి పెయింట్‌ పని చేస్తుండగా ఉదయం 11 గంటల ప్రాంతంలో పెయింట్‌ రోలరు 11 కేవీ లైనుకు తగిలి విద్యుత్‌ షాక్‌కు గురై కిందపడి సృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ధనుంజయకు భార్య మహాలక్ష్మి,ఒక సంవత్సరం వయస్సు గల కూతురు ప్రియాంశి ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

విద్యుత్‌ తీగలు తగిలి గేదె మృతి

మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీలోని సర్వాయపల్లె వద్ద గురువారం విద్యుత్‌ తీగెలు తగిలి భూమిరెడ్డి స్వర్ణ అనే మహిళకు చెందిన చూడి గేదె మృతి చెందింది. గడ్డమాల వాడకు చెందిన స్వర్ణ గ్రామానికి చెందిన మరికొందరు మహిళలతో కలిసి తమకున్న మూడు గేదెలను, ఆరు దూడలను సర్వాయపల్లె సమీపంలోని సాగు చేయని పొలాల్లోకి మేపు కొనేందుకు తోలుకొని వెళ్లింది. సర్వాయపల్లె వద్ద అతితక్కువ ఎత్తులో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. గడ్డి మేస్తూ అటుగా వెళ్లిన గేదె ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుత్‌ తీగెలు తగలడంతో మృతి చెందింది. గేదె మృతితో యజమానులు రమేష్‌, స్వర్ణ దంపతులు లబోదిబోమన్నారు. గేదె రూ.70వేలు విలువ చేస్తుందని, తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు వారు తెలిపారు.

చోరీ కేసులో నిందితుడు అరెస్ట్‌

వల్లూరు : వల్లూరు బస్టాపు నుంచి గ్రామంలోకి వచ్చే దారిలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 23 వ తేదీ రాత్రి జరిగిన చోరీ కేసుకు సంబంధించి నిందితుడు పుల్లారెడ్డిని గురువారం అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బాలుగారిపల్లెకు చెందిన పుల్లారెడ్డి మద్యానికి బానిసై కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 23 వతేదీ రాత్రి మద్యం మత్తులో ఆంజనేయ స్వామి ఆలయంలోని హుండీని పగులగొట్టి అందులోని నగదును చోరీ చేశాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గురువారం గోటూరు క్రాస్‌ వద్ద ఉన్న నిందితుడు పుల్లారెడ్డిని అరెస్ట్‌ చేసి, అతని వద్ద నుంచి రూ 2022 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టుకు హాజరు పరచగా కోర్టు అతనికి రిమాండ్‌ విధించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement