ప్రొద్దుటూరు కల్చరల్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా తీవ్ర జాప్యం చేస్తూ వారి ఓపికను పరీక్షించొద్దని రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇంజా సోమశేఖర్ రెడ్డి తెలిపారు.
గురువారం స్థానిక రాష్ట్ర ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల ఆర్థిక బకాయిలను విడుదల, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులర్, స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరు, 12వ పీఆర్సీ కమిషన్ నియమించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సమస్యలపై స్పందించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సాయికుమార్, ఆర్థిక కార్యదర్శి పుల్లారెడ్డి, ఉపాధ్యక్షులు గరుడాచలం, సంయుక్త కార్యదర్శి కిరణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పి.నాగేంద్ర రెడ్డి, కేశవరెడ్డి, ఆంజనేయులు, సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


