మోసం చేసిన నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

మోసం చేసిన నిందితుడి అరెస్టు

Aug 28 2026 1:51 AM | Updated on Aug 28 2026 1:51 AM

ముద్దనూరు : పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని మోసం చేసిన కేసులో నిందితుడు వెంకట మురళిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నగేష్‌బాబు సమాచారం మేరకు పెనికలపాడుగ్రామానికి చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన మురళి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు.అనంతరం ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించినట్లు సీఐ తెలిపారు.

రిమ్స్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కడపలోని రిమ్స్‌లో ఈనెల 17వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి (50) వైద్య సేవల కోసం చేరాడు. 24వ తేదీ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో వస్తే మతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్‌ అధికారులు తెలియజేశారు.

ఎర్రగుంట్ల ఆర్టీసీ బస్టాండ్‌లో..

ఎర్రగుంట్ల : ఎర్రగుంట్లలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో ఉన్న బెంచీలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి సుమారు 60–70 మధ్య వయస్సు ఉంటుంది. చారల చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏవరికై నా సమాచారం తెలిస్తే ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు.

ఇస్రో శాస్త్రవేత్తకు సన్మానం

పోరుమామిళ్ల : గ్రామ సచివాలయ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో శాస్త్రవేత్తగా ఎంపికై న సి.వి. రమేష్‌కుమార్‌ను గురువారం పోరుమామిళ్ల ఎస్టీయూ నాయకులు సన్మానించారు. రీజనల్‌ కన్వీనర్‌ వివి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మానసభలో జిల్లా ఆర్థిక కార్యదర్శి సుబ్రమణ్యం, రాష్ట్ర కన్వీనర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ గ్రామీణప్రాంతంలో పుట్టి పెరిగిన రమేష్‌కుమార్‌ సచివాలయ ఉద్యోగిగా జీవితం ప్రారంభించి ప్రపంచంలో పేరొందిన విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో శాస్త్ర వేత్తగా ఎంపిక కావడం గర్వకారణమని తెలిపారు.

సెల్‌ఫోన్‌ అప్పగింత

మైదుకూరు : బస్సులో పోగొట్టుకున్న సెల్‌ ఫోన్‌ను గురువారం మైదుకూరు ఆర్టీసీ అధికారులు బాధితునికి అప్పగించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన కమ్మర రఘునాథాచారి తిరుపతి నుంచి కర్నూలుకు వెళ్లే బస్సులో ప్రయాణిస్తూ రూ.43వేలు విలువైన తన సెల్‌ ఫోన్‌ను బస్సులో మర్చిపోయారు. మైదుకూరు బస్టాండ్‌ కంట్రోల్‌ పాయింట్‌లో ఉన్న శంకర్‌కు సమాచారం ఇవ్వగా ఆయన బస్సు సిబ్బందితో మాట్లాడి సెల్‌ ఫోన్‌ను తెప్పించారు. ప్రయాణికుడు రఘునాథాచారిని పిలిపించి డిపోకు చెందిన ఆయిల్‌ విభాగం కె.లక్ష్మయ్య, కానిస్టేబుల్‌ అనురాధ సమక్షంలో సెల్‌పోన్‌ను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement