తనయుడిపై కోపం.. తండ్రి హతం | - | Sakshi
Sakshi News home page

తనయుడిపై కోపం.. తండ్రి హతం

Aug 21 2026 2:57 AM | Updated on Aug 21 2026 2:57 AM

రాజంపేట : తనయుడిపై ఉన్న కోపం తండ్రి ప్రాణాలకు ముప్పు తెచ్చిన సంఘటన రాజంపేట పట్టణం సుద్దగంతల్లో చోటుచేసుకుంది. సీఐ నాగార్జున వివరాల మేరకు పట్టణంలోని సుద్దగుంతల ప్రాంతంలో చిలకాల పెంచలయ్య (60) తనయుడు నరేంద్రలు కలిసి పాలవ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన బిళ్లా నరసింహులు అనే వ్యక్తి నరేంద్రపై కక్ష పెంచుకున్నాడు. అతనిపై కోపంతో అందుబాటులో ఉన్న చిలకాలపెంచలయ్యను కత్తితో పొవడవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బిళ్లానరసింహులు, మృతుడు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. కాగా ఈ హత్య మహిళతో అక్రమసంబంధం ఉందన్న కారణంగా జరిగినట్లు స్ధానికంగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు కూడా అదే చెబుతున్నారు. కాగా వృద్ధుడు హత్యతో ఆయన కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

రంగంలోకి దిగిన క్లూస్‌టీం

వృద్ధుడు పెంచలయ్య హత్యకు గురైన నేపథ్యంలో క్లూస్‌టీం రంగంలోకి దిగింది. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాల కోసం అనేషించింది. అయితే నరేంద్రను హత్య చేయకుండా, ఆయన తండ్రి పెంచలయ్యను ఎందుకు హత్య చేశాడన్నది పోలీసులు తొలిచివేసిన అంశం.హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టరం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.

రాజంపేటలో పాలవ్యాపారి హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement