వేంపల్లె : ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని, కాబట్టి రాబోయే స్థానిక సంస్థల సమరానికి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సిద్ధం కావాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వేంపల్లెలోని శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్న వైఎస్సార్‌సీపీ నేత తమ్మిశెట్టి బాబు గృహ ప్రవేశానికి కడప ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ ప్రాంతానికి సంబంధించిన వివిధ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొస్తూ వినతి పత్రాలను అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతులను ఎంపీ స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యకర్తలకు అండగా ఉంటామని, అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మునీర్, బీఎస్ షేక్షావలి, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కమతం రాజా, సుధాకర్, ప్రసాద్ రెడ్డి, బంకా సోమేశ్వరరెడ్డి, బ్రహ్మయ్య, కిష్టయ్య, ముత్యాల ఆంజినేయులు. ఆంజి రెడ్డిలతోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి


