కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జపాన్ షోటోకాన్ కరాటే–డో అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని గౌరిబిదనూరులోని సెయింట్ ఆన్స్ స్కూల్లో నిర్వహించిన ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో కడప విజయ్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీకి చెందిన 19 మంది విద్యార్థులు సత్తా చాటినట్టు ఆ అకాడమీ మాస్టర్ విజయ్ తెలిపారు. విద్యార్థులు అనూ ఏంజెల్, మేఘన, తాన్య, అబ్దుల్లా ఖాన్, వజ్ర దత్, యోగిత్ రామ్, చాడ్విక్, రజిత, హసిని, రోహన్ మొదటి స్థానంలో ట్రోఫీలు సాధించారని ఆయన పేర్కొన్నారు. హితిక, అబ్బాస్ ఖాన్, రుతిక, గణేష్, హన్విక, నైషిక్, రమ్య, మోక్షిత్ రెండవ స్థానంలో ట్రోఫీలు సాధించారని వివరించారు.


