మళ్లీ కేబుల్‌ వైర్ల అపహరణ | - | Sakshi
Sakshi News home page

మళ్లీ కేబుల్‌ వైర్ల అపహరణ

Aug 19 2026 1:47 AM | Updated on Aug 19 2026 1:47 AM

లింగాల : మండలంలోని ఇప్పట్ల గ్రామంలో గుర్తు తెలియని దుండగులు వ్యవసాయ విద్యుత్‌ మోటార్ల కేబుల్‌ వైర్లను తస్కరించారు. గత ఐదారు మాసాలుగా స్తబ్దుగా ఉన్న దొంగలు మళ్లీ కేబుల్‌ వైర్ల చోరీకి పాల్పడ్డారు. ఇప్పట్ల గ్రామ సమీపంలోని బలపాల గుట్ట వద్ద ఉన్న 15 విద్యుత్‌ మోటార్ల కేబుల్‌ వైర్లను సోమవారం రాత్రి అపహరించుకు పోయారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. త్వరలో దొంగలను పట్టుకుని రైతులకు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement