కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ అండర్–19 మెన్ మల్టీడే జోనల్ మ్యాచ్ విజేతగా 8 పాయింట్లతో టీమ్–ఈ జట్టు నిలిచింది. మూడవ రోజు మంగళవారం కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టీమ్–ఈ జట్టు టీమ్–బీ జట్టుపై 514 పరుగుల తేడాతో విజయం సాధించింది. వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమ్–ఏపై టీమ్–డీ జట్టు 277 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 277 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్–ఈ జట్టు 91.3 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 419 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని గౌతమ్ ఆర్య అద్భుతంగా రాణించి 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. టీమ్–బీ జట్టులోని దేవాషిస్ 4, ధీరజ్‌కుమార్‌రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్–బీ జట్టు 21.2 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. ఆ జట్టులోని వీరేంద్ర అన్వేష్ 29, కేవీ ఓంకార్ 25 పరుగులు చేశారు. టీమ్–ఈ జట్టులోని లక్ష్మీ గౌతమ్ 3 వికెట్లు తీశాడు. దీంతో టీమ్ ఈ జట్టు 514 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో..
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 205 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్–డీ జట్టు 83.4 ఓవర్లకు 278 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని క్రాంతి కుమార్ 43 పరుగులు చేశాడు. టీమ్–ఏ జట్టులోని ఫణీంద్ర 3, లోహిత్‌రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్–ఏ జట్టు 40.4 ఓవర్లకు 142 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని దేవ్ ప్రమోద్ 59 పరుగులు చేశాడు. టీమ్–డీ జట్టులోని రణదీప్ చక్కటి లైనఫ్‌తో బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. జయంత్ 4 వికెట్లు తీశాడు. దీంతో టీమ్–డీ జట్టు 277 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ జోనల్ మ్యాచ్‌లో టీమ్–ఈ జట్టు 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా టీమ్–బీ 5 పాయింట్లు, టీమ్–డీ 3 పాయింట్లు, టీమ్–సీ జట్టు 1 పాయింటు సాధించింది.


