కడప ఎడ్యుకేషన్ : తిరుపతిలో ఆగస్టు 24 నుంచి 27 వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్–2026 హాకీ పోటీలకు కడప ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన బీకాం సీఏ ఫైనల్ ఇయర్‌కు చెందిన విద్యార్థి ఇందిర ఎంపికై ంది. జిల్లా స్థాయి పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఇందిర.. కళాశాల క్రీడా విభాగం తరఫున రాష్ట్ర జట్టుకు ఎంపికై ంది. ఆ విద్యార్థిని ప్రిన్సిపాల్ డాక్టర్ స్మిత, క్రీడా విభాగం అధికారి, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.
అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ
కడప ఎడ్యుకేషన్ : తిరుపతిలో ఆగస్టు 11 నుంచి 13 వరకు జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో కడప ఆర్ట్స్ కళాశాలకు చెందిన విద్యార్థి అరవింద్ సత్తా చాటాడు. ఆర్ట్స్ కళాశాలలో బీఏ తెలుగు ఆనర్స్ చదువుతున్న అరవింద్ అండర్ 20 విభాగంలో హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి, స్వర్ణ పథకం సాధించాడు. దాంతోపాటు త్వరలో జరగబోయే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు. ఆ విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్ జె.వెంకటలక్ష్మి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమణారావు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఇన్‌చార్జ్ టి.హజరతయ్య , పీడీ మహేష్ అభినందించారు.
యువకుడిపై కేసు నమోదు
కలసపాడు : మండలంలోని ముద్దంవారిపల్లె గ్రామానికి చెందిన హర్ష అనే యువకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జి శివశంకర్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు ఇంట్లో వసతి లేక బహిర్భూమికి బయటికి వెళ్లారు. ఆ ప్రదేశంలో గ్రామానికి చెందిన హర్ష ఉండటంతో గమనించిన బాలికలు ఇంటికి వచ్చి తల్లి భారతికి విషయం చెప్పారు. దీంతో భారతి అక్కడికి వెళ్లి చూడగా అక్కడే ఉన్న హర్షను మందలించింది. దీంతో ఆమైపె హర్ష చేయి చేసుకున్నాడు. దీంతో సోమవారం రాత్రి భారతి.. హర్షపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


