కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రమేష్ పేర్కొన్నారు. మంగళవారం నగర శివారులోని తెలుగు కాలనీలో యువజన సర్వీసుల శాఖ, ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్‌సీసీ క్యాంపస్‌లో విద్యార్థులకు ‘మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత, విద్యార్థులు చెడు అలవాట్లకు, మత్తుపదార్థాలకు బానిసలుగా మారి.. ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలను, చట్టపరమైన శిక్షలను వివరించారు. దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాల్సిన ఎన్‌సీసీ క్యాడెట్లు సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు అంబాసిడర్లుగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్ లోకనాథం, స్టెప్ సీఈఓ బీవీ ప్రసాద్ రావు, స్టెప్ జనరల్ మేనేజర్ సుబ్బరాయుడు, ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ శాఖ ఇన్‌స్పెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
జూదరుల అరెస్ట్
మైదుకూరు : మైదుకూరు పట్టణంలోని వెంకటసుబ్బయ్య కాలనీ సమీపంలో మంగళవారం పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్టు అర్బన్ ఎస్‌ఐ కత్తి వెంకటరమణ తెలిపారు. వారి వద్ద ఉన్న పేక ముక్కలు, రూ.6,640 నగదు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.


