ఉత్సాహంగా మల్టీడే జోనల్‌ మ్యాచ్‌లు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా మల్టీడే జోనల్‌ మ్యాచ్‌లు

Aug 18 2026 12:09 AM | Updated on Aug 18 2026 12:09 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–19 మల్టీడే ఇంటర్‌ జోనల్‌ మ్యాచ్‌లు రెండవ రోజు ఉత్సాహంగా కొనసాగాయి. సోమవారం కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 73 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమ్‌–బీ జట్టు 35.2 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆ జట్టులోని దేవాషిస్‌ 84, కేవీ ఓంకార్‌ 29 పరుగులు చేశారు. టీమ్‌–ఈ జట్టులోని తేజసాయి 3, గౌతమ్‌ ఆర్య 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమ్‌–ఈ జట్టు 65 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఆ జట్టులోని నారాయణ 67, సాయి గణేష్‌ 55 పరుగులు చేశారు. టీమ్‌–బీ జట్టులోని ధీరజ్‌కుమార్‌రెడ్డి 2, దేవాషిస్‌ 2 వికెట్లు తీశారు. దీంతో టీమ్‌–ఈ జట్టు 443 పరుగుల ముందంజలో ఉంది. దీంతో రెండో రోజు ఆట ముగిసింది.

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో..

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమ్‌–ఏ జట్టు 55.5 ఓవర్లకు 161 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని దేవ్‌ ప్రమోద్‌ 51, శశాంక్‌రెడ్డి 29 పరుగులు చేశారు. టీమ్‌–డీ జట్టులోని రణదీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 5 వికెట్లు తీశాడు. జయంత్‌ 4 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమ్‌–డీ జట్టు 57 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్‌ 57, భాను శ్రీ హర్ష 52 పరుగులు చేశారు. టీమ్‌–ఏ జట్టులోని లోహిత్‌రెడ్డి 2 వికెట్లు తీశాడు. దీంతో టీమ్‌–డీ జట్టు 346 పరుగుల ముందంజలో ఉంది. దీంతో రెండో రోజు ఆట ముగిసింది.

జయంత్‌

(4 వికెట్లు)

దేవాషిస్‌

(84 పరుగులు)

రణదీప్‌

(5 వికెట్లు)

నారాయణ

(67 పరుగులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement