కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కడప నగరంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో అనీస్ దర్బారీ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ ప్రైజ్ మనీ చెస్ టోర్నమెంట్ ఉత్సాహంగా జరిగిందని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి అనీస్ దర్బారీ తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 167 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్‌లో కడపకు చెందిన రూపేష్ రెడ్డి 7 పాయింట్లు సాధించి ప్రథమ స్థానంలో, అనంతపురానికి చెందిన భరత్ భూషణ్ 6 పాయింట్లు సాధించి ద్వితీ య స్థానంలో, కడపకు చెందిన నూలాల జస్వంత్ 6 పాయింట్లు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. గెలుపొందిన క్రీడాకారులకు డీఎస్‌డీవో గౌస్‌బాషా బహుమతులను అందజేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్రిపాటి నాగరాజా, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పీడీ జయచంద్ర రెడ్డి, టోర్నీ డైరెక్టర్ తబస్సుమ్ పాల్గొన్నారు.
జాతికి స్ఫూర్తి..
సర్దార్ గౌతు లచ్చన్న
కడప సెవెన్ రోడ్స్ : అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జాతికి స్ఫూర్తిదాయకం అని డీఆర్వో కె.మల్లికార్జునుడు కొనియాడారు. ఆదివారం కలెక్టర్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చ న్న జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణ, స్టెప్ సీఈవో ప్రసాద్, బీసీ జాతీయ మహాసభ జాతీయ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున, జిల్లా గౌడ సంఘం గౌరవాధ్యక్షులు రామమూర్తి నాయుడు పాల్గొన్నారు.
19నుంచి యోగా పోటీలు
వేంపల్లె : జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి జిల్లా స్థాయి యో గా పోటీలు నిర్వహించనున్నట్లు రాయలసీమ యోగా స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ మనోహర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి తేజా, జాయింట్ సెక్రటరీ షఫీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేంపల్లెలోని వైఎస్‌ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో నిర్వహించే ఈ పోటీలను సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగంలో ఉంటాయని వివరించారు. వివరాలకు 9398014919, 9440470064 నెంబర్లుకు సంప్రదించాలని కోరారు.
ఫలితాలు విడుదల
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన గ్రంథాలయ పరీక్ష ఫలితాలను ప్రభుత్వ పరీక్షల సంచాలకులు విడుదల చేసినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. దీనికి సంబంధించి https://www.bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో ఫలితాలను పొందవచ్చని పేర్కొన్నారు.


