పార్టీ బలోపేతంలో యువతే కీలకం | - | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతంలో యువతే కీలకం

Aug 17 2026 1:29 AM | Updated on Aug 17 2026 1:29 AM

కడప కార్పొరేషన్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడంలో యువజన విభాగం కీలకపాత్ర పోషించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అఽధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకుల సలహాలు, సూచనలు తీసుకుంటూ యువత ముందుకు సాగాలన్నారు. హోదాలను బట్టి బాధ్యతాయుతంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎన్నికల ముందు విద్యార్థులు, యువతకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయ కుండా వారిని మోసం చేశారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని, 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని లేనిపక్షంలో నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారన్నారు. కానీ రెండూ ఇవ్వలేదన్నారు. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోయి యువతీ, యువకులను పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా చేయాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 1.35లక్షల సచివాలయ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేసిందన్నారు. ఈ కూటమి ప్రభుత్వం కేవలం 16వేల పోస్టులకు డీఎస్సీ ఇచ్చి అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. యువజన విభాగం నేతలు చురుగ్గా ఉండాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య మాట్లాడుతూ పదవిని అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతగా భావించి పార్టీ కోసం కష్టపడదామని పిలుపునిచ్చా రు. సమావేశంలో మాజీ మేయర్‌ పాకా సురేష్‌ కుమార్‌, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బూసిపాటి కిశోర్‌, ఎస్సీసెల్‌ స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పులి సునీల్‌, యువజన విభాగ నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు షఫీవుల్లా, నియోజకవర్గ అధ్యక్షుడు గురునాథరెడ్డి, చంద్ర ఓబుల్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, హరీష్‌రెడ్డి, నరసింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పఠాన్‌ఖాన్‌, పి. సందీప్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement