యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Aug 16 2026 5:09 AM | Updated on Aug 16 2026 5:09 AM

రాజంపేట : పట్టణంలోని బండ్రాళ్లవీధిలో నారాయణ రాఘవ గుప్తా(21) శనివారం ఇంటిలో ఫ్యాన్‌కు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు చేరుకొని, మృతుడి సంబంధీకులను విచారణ చేశారు. అతను బెంగళూరులో బిజినెస్‌ మేనెజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్నట్లు తెలిసింది. కోర్సులో ఫెయిల్‌ కావడంతో కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ ఆత్మహత్యాయత్నం

మదనపల్లె టౌన్‌ : మండలంలోని బడికాయలపల్లికి చెందిన రామకృష్ణ భార్య ఎన్‌.సుమిత్ర(32) కడుపు నొప్పి తాళలేక శనివారం ఇంట్లో ఉన్న కల్లాపి చల్లే పౌడర్‌ నీళ్లలో కలిపి తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబీకులు గమనించి బాధితురాలిని మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

పింఛా నదిలో పడి వ్యక్తి మృతి

సుండుపల్లె : మండల పరిధిలోని పింఛా ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న పింఛా నది మడుగు నీటిలో పడి రాగి మానుబిడికికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. శనివారం సాయంత్రం పింఛా నదిలో కొందరు చేపల వేట నిర్వహిస్తుండగా.. మండల పరిధిలోని మాచిరెడ్డిగారిపల్లె పంచాయతీ రాగిమానుబిడికికి చెందిన మూడే ప్రవీణ్‌నాయక్‌(42) అక్కడికి వెళ్లి చూస్తూ ప్రమాదవశాత్తూ జారి నది నీటిలో పడి మడుగు లోపల చిక్కుకుని మృతి చెందినట్లు తెలిపారు. పక్కనే ఉన్న చేపల వేటగాళ్లు వెంటనే తేరుకుని నీటిలో గాలించగా నీటి లోపల చిక్కుకున్న ప్రవీణ్‌నాయక్‌ను వెలుపలికి తీయగా అప్పటికే అతను మృతి చెందినట్లు గుర్తించి మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించారు. మృతుడి భార్య కువైట్‌లో ఉండగా, కుమార్తె కుమారుడు ఉన్నారు. సుండుపల్లె పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయచోటి ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement