కడప కోటిరెడ్డి సర్కిల్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కట్టుదిట్టమైన భదత్రా ఏర్పాట్లు చేశామని అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్‌బాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.రమణయ్యలు తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పోలీసు పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు జాగిలాలు గ్రౌండ్‌లో చేసి న విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పెరేడ్ కమాండర్స్, ఏఆర్ డీఎస్పీ నాగేశ్వరరావు, ఆర్‌ఎస్‌ఐ కె.వెంకటేశ్వర్లు పెరేడ్‌లో మార్చింగ్ నిర్వహించారు. ఆర్‌ఐలు సోమశేఖర్ నాయక్, పెద్దయ్య, టైటస్, సివిల్, ఏఆర్, పోలీసు, హోంగార్డులు, ఎన్‌సీసీ, స్కౌట్స్ విద్యార్థులు పాల్గొన్నారు.


