పోరుమామిళ్ల : పట్టణంలోని ఉద్దికట్టవీధికి చెందిన నీరుగంటి మస్తాన్‌వలి (35) శుక్రవారం ఉదయం రెవెన్యూ చావిడి వద్ద రోడ్డు దాటుతుండగా లారీ కింద పడి మృతి చెందాడు. చావిడి దగ్గర ప్రధాన రహదారిలో రోడ్డు దాటుతుండగా విజయవాడ వైపు నుంచి మైదుకూరు వైపు వెళుతున్న ఐషర్ లారీ కింద పడ్డాడని తెలిసింది. లారీ డ్రైవర్ ఆపి చూసేటప్పటికి ప్రాణాలతో ఉండటంతో వెళ్లి పోయాడని, లారీ వెళ్లిన పది నిమిషాల్లోనే అతను మృతి చెందాడని సమాచారం. మస్తాన్‌వలి చనిపోడంతో సమాచారం పోలీసులకు తెలపడంతో లారీని బి.మఠం పోలీసులు పట్టుకుని, పోరుమామిళ్లకు తెచ్చారని తెలిసింది. మృతుడి తల్లి నీరుగంటి ఖాశింబీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. తన కుమారుడు కూలీ పని చేసుకుని జీవనం చేసేవాడని, భార్య చనిపోయిందని, అతనికి పిల్లలు లేరని పేర్కొంది. శుక్రవారం పనికి పోయేందుకు ఉదయమే వెళ్లాడని, లారీ ఢీ కట్టడంతో మృతి చెందాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


