రాగి తీగెల దొంగల ఆటకట్టు | - | Sakshi
Sakshi News home page

రాగి తీగెల దొంగల ఆటకట్టు

Aug 15 2026 1:45 AM | Updated on Aug 15 2026 1:45 AM

రాగి తీగెల దొంగల ఆటకట్టు

చాపాడు : మండల పరిధిలోని ఆనంద ఆశ్రమం రోడ్డు వద్ద ఇద్దరు రాగి తీగెల దొంగలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ చిన్న పెద్దయ్య తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన మేకల బబ్లూ, పాపగాల్ల సుధీర్‌ పలు చోట్ల విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి వైర్లను దొంగలించినట్లు ఈ నెల 2న కేసు నమోదైందన్నారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరులో ఒక వ్యక్తిపై దాడి చేసిన కేసుతోపాటు, 7న అల్లాడుపల్లె రోడ్డు వద్ద మూలే ఖాదర్‌రెడ్డి అనే వ్యక్తిని కత్తితో బెదిరించి నగదు, సెల్‌ఫోన్‌ దొంగలించిన కేసులతోపాటు గతంలో గంజాయి, దొంగతనాలు, మద్యం కేసులు వారిపై ఉన్నాయన్నారు. పట్టుబడిన వీరి వద్ద నుంచి ఒక మోటార్‌బైక్‌, కత్తిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరిని తమ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement