వేంపల్లె : యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా మారం శ్రీకాంత్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం వేంపల్లె మండలం నందిపల్లె గ్రామానికి చెందిన శ్రీ నందీశ్వరాలయ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌గా ఉన్న మారం శ్రీకాంత్ రెడ్డిని యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు ఏపీ రాష్ట్ర యోగా స్పోర్ట్స్ కార్యదర్శి అవినాష్‌శెట్టి నియామక పత్రం అందజేశారు.
ఒంటిమిట్ట : మండల పరిధిలోని మలకాటిపల్లి గ్రామానికి చెందిన సిరాల కృష్ణయ్య(70) రోడ్డు ప్రమాదంలో గాయపడి శుక్రవారం ఇంటి దగ్గర తీవ్ర అనారోగ్యంలో మృతి చెందినట్లు ఒంటిమిట్ట పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత నెల 6వ తేదీన సిరాల కృష్ణయ్య ఆటోలో కడప వైపు వెళ్తుండగా వెనుక వైపు నుంచి లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కోలుకోలేక అనారోగ్యంతో శుక్రవారం ఇంటి దగ్గర మృతి చెందినట్లు ఒంటిమిట్ట పోలీసులు తెలిపారు.


