పులివెందుల రూరల్ : పులివెందులలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత శుక్రవారం రహదారుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి వైఎస్‌ఆర్ కడప జిల్లాలో రూ.182.74 కోట్లతో 586 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. రూ.10.55 కోట్లతో పులివెందుల నియోజకవర్గ పరిధిలో రోడ్లు అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్ బీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
గండి అంజన్న సేవలో..
గండి వీరాంజనేయ స్వామిని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆయన వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీటెక్ రవి, జనసేన నేత డాక్టర్ రవితోపాటు వేంపల్లె, చక్రాయపేట మండలాలకు చెందిన పలువురు నాయకులు, ఆలయ పాలకమండలి సభ్యులు ఉన్నారు.


