● కుక్క తోక వంకర.. పిల్లల తోక టింకర! | - | Sakshi
Sakshi News home page

● కుక్క తోక వంకర.. పిల్లల తోక టింకర!

Aug 14 2026 7:56 AM | Updated on Aug 14 2026 7:56 AM

పులివెందుల ఉద్యాన కళాశాల ప్రాంగణంలో ఒక కుక్క జన్మనిచ్చిన ఎనిమిది కుక్కపిల్లలు ఒక అరుదైన శారీరక వైవిధ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తెలుపు, గోధుమ రంగు మచ్చలతో ఎంతో ముద్దుగా ఉన్న ఈ పిల్లలలో మూడింటికి మాత్రమే సాధారణంగా తోకలు ఉన్నాయి. మిగిలిన ఐదు కుక్కపిల్లలకు తోక చాలా చిన్నగా ఉండటం లేదా అస్సలు కనిపించకపోవడం ఇక్కడ విశేషంగా నిలిచింది. ఈ శారీరక లక్షణాలు వాటి తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా సంక్రమించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎంతో ఆరోగ్యంగా, చురుకుగా ఉన్న ఈ కుక్కపిల్లలను కళాశాల విద్యార్థులు, సిబ్బంది తమ విశ్రాంతి సమయంలో ఎంతో ప్రేమగా సంరక్షిస్తూ, ఆహారం అందిస్తున్నారు. మూగజీవాలలో కనిపించే ఇలాంటి వింత లక్షణాలు భవిష్యత్తులో జంతు శాస్త్రవేత్తల పరిశోధనలకు మరియు శాసీ్త్రయ అధ్యయనాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

– పులివెందుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement