వెయ్యడుగుల మువ్వన్నెల జెండా! | - | Sakshi
Sakshi News home page

వెయ్యడుగుల మువ్వన్నెల జెండా!

Aug 14 2026 7:56 AM | Updated on Aug 14 2026 7:56 AM

వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాలో ప్రజలు ముందస్తు స్వాతంత్య్ర వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. మదనపల్లెలో రాజకీయ పార్టీల నేతలు, పట్టణ ప్రముఖులు, విద్యార్థు లు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు భాగస్వాములై వెయ్యి అడుగుల తిరంగా పతాకాన్ని చేతబట్టి నడిచారు. విద్యార్థులు అశ్వాలపై మువ్వన్నెల జెండాతో ముందుకు నడుస్తుంటే.. వారి వెంట జనం ప్రదర్శనగా వెళ్లారు. స్థానిక టిప్పు సుల్తాన్‌ మైదానం నుంచి ప్రారంభమైన తిరంగా ప్రదర్శన.. జాతి సమైక్యత నినాదాలతో పండగ వాతావరణంలో జరిగింది. అలాగే, హర్‌ ఘర్‌ తిరంగాను పురస్కరించుకుని గురువారం కడప గాంధీనగర్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు 1,000 అడుగుల జాతీ య జెండాతో ఎర్రముక్కపల్లి సర్కిల్‌ వర కు ర్యాలీ చేశారు. సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్‌ వాండ్రాసి పెంచలయ్య పాల్గొన్నారు.

– సాక్షి, మదనపల్లె/కడప ఎడ్యుకేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement