కడప కార్పొరేషన్: కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్‌టీయూసీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి చేయూతనిస్తే ఈ కూటమి ప్రభుత్వం కార్మికులకు ఉన్న పథకాలను అన్నింటిని తొలగించి, వారి పొట్ట కొడుతోందని విమర్శించారు. మళ్లీ అభివృద్ధి రావాలన్నా, కార్మిక, కర్షక సోదరులకు సంక్షేమ ఫలాలు అందాలన్నా 2029లో మనమందరం సమిష్టిగా కృషి చేసి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌టీయూసీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతి మండలం, గ్రామ స్థాయిలో కమిటీలు వేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్‌కుమార్, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు మల్లూరి జాషువా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరా రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సుదర్శన్ రాయల్, రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్, స్టేట్ జాయింట్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి, జిల్లా నాయకులు, నియోజక వర్గ అధ్యక్షులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి


