కడప సెవెన్ రోడ్స్ : రాష్ట్ర రోడ్డు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి శుక్రవారం కడప జిల్లా పర్యటనకు రానున్నారని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఉదయం 10.30గంటలకు పులివెందులకు చేరుకుంటారు. సాయంత్రం వరకు స్థానిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం కడపకు చేరుకుని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. శనివారం ఉదయం పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించనున్నారు.
వైఎస్సార్‌సీపీలో నియామకాలు
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పులివెందులకు చెందిన ఎం. విశ్వనాథ్ యాదవ్‌ను జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా, కడపకు చెందిన సీ. వెంకట రమణను బీసీ విభాగం ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
కొనసాగుతున్న యాత్ర
చక్రాయపేట: గ్లోబల్ వార్మింగ్ ముప్పును తగ్గించి అడవుల పెంపకంపై అవగాహన కల్పి స్తూ తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన బయోటెక్నాలజీ విద్యార్థి ముత్తు సెల్వం చేపట్టిన సైకిల్ యాత్రం గురువారం సాయంత్రం చక్రాయపేటకు చేరుకుంది.ఈ సందర్భంగా ఎస్సై చంద్రశేఖర్ ఆయనకు స్వాగతించి కొంత మేర ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ముత్తు సెల్వం మాట్లాడుతూ 2027 నాటికి డిల్లీకి చేరడంతో తన 44వేల కిమీ యాత్ర ముగుస్తుందని వివరించాడు.


