తిరుపతి–తిరువణ్ణామలై రహదారిని అభివృద్ధి చేయండి | - | Sakshi
Sakshi News home page

తిరుపతి–తిరువణ్ణామలై రహదారిని అభివృద్ధి చేయండి

Aug 13 2026 12:57 AM | Updated on Aug 13 2026 12:57 AM

కడప కార్పొరేషన్‌: తిరుపతి నుంచి తమిళనాడులోని తిరువన్నామలై వరకు ఉన్న రహదారిని మరింత అభివృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కోరారు. బుధవారం ఢిల్లీలో వారు జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖామంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. తిరుపతి, కాణిపాకం, వేలూరు, తిరువణ్ణామలై వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే భక్తులకు ఈ మార్గం ఎంతో ముఖ్యమైందని ఎంపీలు మంత్రికి వివరించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ ...వెంటనే డీపీఆర్‌ తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఎంపీలు వివరించారు.

జాతీయ రహదారుల శాఖ మంత్రి

నితిన్‌ గడ్కరికీ వైఎస్సార్‌సీపీ ఎంపీల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement