కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలి

Aug 13 2026 12:57 AM | Updated on Aug 13 2026 12:57 AM

ఎర్రగుంట్ల : విద్యుత్‌ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, లేకపోతే ఉద్యమిస్తామని కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు. బుధవారం ఆర్టీపీపీలోని ఏపీ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపు మేరకు ఆర్టీపీపీ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ కమిటీ చైర్మన్‌ కట్టా నాగరాజు మాట్లాడుతు చాలా ఏళ్ల నుంచి కార్మికులు చాలీచాలనీ జీతాలతో పనులు చేస్తున్నారన్నారు. వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. జేఏసీ జనరల్‌ సెక్రటరీ నారాయణరెడ్డి మాట్లాడుతు ఏపీ జెన్‌కోలో పనిచేస్తున్న కార్మికుల సీనియారిటీ, విద్యార్హత నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రేడ్‌ మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు సీపీడీసీఎల్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాసులు మాట్లాడుతు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన కార్మికులకు జీఓ 129 ప్రకారం వేతనాలు చెల్లించాలని, అలాగే జీఓ 167 కింద పనిచేస్తున్నత కార్మికులకు కడూఆ జీఓ 129 ప్రకారం వేతనాలు అమలు చేయాలని కోరారు. కార్మికులందరు హక్కుల సాధనకోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు శివయ్య, రామక్రిష్ణారెడ్డి, ఓబులేసు, కాంట్రాక్ట్‌ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement