కడప అర్బన్: కడపలోని గోకుల్ టీ వద్ద ఉన్న డివైడర్‌ను దాటుతున్న కడప సాక్షి ఫోటోగ్రాఫర్ మహమ్మద్ రఫీని బైక్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రఫీ తీవ్రంగా గాయపడి అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు, బంధువులు అతన్ని ఖలీల్‌బాషా ఆసుపత్రిలో చేర్పించారు. కుడిచేయి, కాలుకు గాయాలయ్యాయి. కెమెరా పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనపై కడప వన్ టౌన్, ట్రాఫిక్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
పోలీసుల అదుపులో
నకిలీ బంగారం విక్రేత
పులివెందుల రూరల్ : పులివెందుల బంగారు దుకాణాలలో నకిలీ బంగారం విక్రయిస్తున్నారన్న అనుమానంతో హర్యానాకు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ఇలా నకిలీ బంగారాన్ని దుకాణాలలో కుదవపెట్టి సుమారు లక్షల రూపాయలు తీసుకెళ్లారని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హర్యానాకు చెందిన రాజ్ కుమార్ నకిలీ బంగారాన్ని అమ్ముతున్నాడని అనుమానంతో పోలీసులకు అప్పగించినట్లు వ్యాపారులు తెలిపారు.


