అదృశ్యమైన బాలుడి మృతి | - | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన బాలుడి మృతి

Aug 12 2026 2:58 AM | Updated on Aug 12 2026 2:58 AM

బీటెక్‌ రవి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు

చాపాడు : మండల పరిధిలోని మడూరు గ్రామంలో సోమవారం సాయంత్రం కనిపించకుండా పోయిన పబ్లేటి మెహనూర్‌ అలియాస్‌ ఆసిఫ్‌(11) మంగళవారం సాయంత్రం విగతజీవిగా కనిపించాడు. ఎస్‌ఐ చిన్న పెద్దయ్య తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన బాలుడు ఆడుకోవడానికి అని బయటికి వెళ్లి కనిపించలేదన్నారు. బాలుడి తండ్రి మహమ్మద్‌ రఫీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. డ్రోన్‌ కెమెరాలతో గాలింపు చేపట్టగా గ్రామంలోని మహబూబ్‌ బాషా, కొండా సుబ్బారెడ్డి గృహాల మధ్య బాలుడిని గుర్తించామన్నారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు. మృతదేహాన్ని రూరల్‌ సీఐ శివశంకర్‌ పరిశీలించారు. బాలుడి ఒంటిపై గాయాలు ఉండటంతో విద్యుత్‌ ప్రమాదానికి గురై మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

అన్నపై దాడి కేసులో ఏడేళ్లు జైలు

రాజంపేట : తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం పుల్లారెడ్డిపల్లె దళితవాడకు చెందిన దాస్తోటి సుబ్రమణ్యం.. తన అన్న దాస్తోటి నారాయణపై కొడవలితో దాడి చేసిన కేసులో.. నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ రాజంపేట అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి నక్క లావణ్య మంగళవారం తీర్పు ఇచ్చారు. రైల్వేడూరు సీఐ డి.శ్రీనివాసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుల్లంపేట మండలం పుల్లారెడ్డిపల్లె దళితవాడకు చెందిన దాస్తోటి సుబ్రమణ్యం, దాస్తోటి నారాయణ అన్నదమ్ములుగా ఉన్నారు. పెద్దల ఆస్తిగా ఉన్న మేకల పంపకంలో.. 2019లో అన్న, తమ్ముడి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో దాస్తోటి నారాయణపై కొడవలితో దాడి చేసి, గాయపరిచారు. అప్పట్లో ఈ సంఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి, దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణ సమయంలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులు, కోడూరు రూరల్‌ సీఐ డి.శ్రీనివాసులు పర్యవేక్షణలో పుల్లంపేట ఎస్‌ఐ చిన్నరెడ్డప్ప కోర్టుకు సాక్షులను హాజరు పరిచారు. ప్రభుత్వం తరఫున అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బాలాజీ సమర్థంగా వాదనలు వినిపించారు.

పులివెందుల రూరల్‌ : బీటెక్‌ రవి అవాస్తవాలు మాట్లాడుతూ డీఎస్సీ అభ్యర్థులను మోసం చేస్తున్నారని డీఎస్సీ అభ్యర్థులు జిలాన్‌బాషా, భాస్కర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం వారు పట్టణంలోని బాకరాపురంలో ఉన్న వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలో కూడా తాము పాల్గొన్నామన్నారు. తమతోపాటు వందలాది మంది డీఎస్సీ అభ్యర్థుఽలు పాల్గొన్నారన్నారు. అలాగే డీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కూడా డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారన్నారు. తమకు జరిగిన అన్యాయంపై బీటెక్‌ రవి స్పందించకుండా తమకు సంఘీభావం తెలిపిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురద జల్లడం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement