హజ్‌ యాత్రికులకు కడపలోనే ఇమిగ్రేషన్‌ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

హజ్‌ యాత్రికులకు కడపలోనే ఇమిగ్రేషన్‌ ఏర్పాటు చేయాలి

Aug 11 2026 12:36 AM | Updated on Aug 11 2026 12:36 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : కడప విమానాశ్రయం అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అన్ని వసతులు కలిగిన నేపథ్యంలో పవిత్ర హజ్‌ యాత్రకు వెళ్లే వారికి ఇమిగ్రేషన్‌తోపాటు కడప నుంచి నేరు గా విమానం ద్వారా జిద్దాకు చేరుకునేలా చూ డాలని ఏపీ ఉలేమా అయిమ్మ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం వారు కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో డీఆర్వో మల్లికార్జునుడికి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్‌ కడప జిల్లా రాయలసీమ మధ్యలో ఉన్నందున జిల్లాతోపాటు అన్నమయ్య, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన హాజీలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీనివల్ల రాయలసీమ హాజీలకు వ్యయ ప్రయాసలు తగ్గుతాయని అందులో పేర్కొన్నారు. అలాగే కడపలో ఉన్న హజ్‌ హౌస్‌ను వాడుక లోకి తీసుకురావాలని, ఇతర జిల్లాల నుంచి వచ్చే హాజీలను భవనంలో వసతి ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మౌల్వీలు మహమ్మద్‌ అలీ బద్దాదీ సాహెబ్‌, వలీవుల్లా హుస్సేనీ సాహెబ్‌, న్యామతుల్లా సాహెబ్‌, అబ్దుల్‌ రెహమాన్‌ సాహెబ్‌, షకృద్దీన్‌ సాహెబ్‌, ఖలీలుల్లా సాహెబ్‌, వాహిద్‌ అలీ సాహెబ్‌, అమీర్‌ బాబు, నజీర్‌ అహ్మద్‌, సలావుద్దీన్‌ పాల్గొన్నారు.

కరపత్రాల ఆవిష్కరణ

కడప సెవెన్‌రోడ్స్‌: ఈనెల 12, 13 తేదీల్లో కడప నగరంలో నిర్వహించనున్న అంబేద్కర్‌ స్టూడెంట్‌ యూత్‌ ఫెడరేషన్‌ (ఏఎస్‌వైఎఫ్‌) రాష్ట్ర మహాసభల కరపత్రాలను సోమవారం స్థానిక సాయిరాం కాలేజీలో విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఎస్‌వైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.ఓబయ్య మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యార్థి సంఘాలను హాస్టళ్లలోకి అనుమతించబోమని సర్క్యులర్‌ జారీ చేయడం ద్వారా తన చేతగానితనాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. జిల్లా నాయకులు ఆఫ్రిద్‌, రఫీ, పవన్‌ పాల్గొన్నారు.

ఎలుగుబంటి దాడిలోవ్యక్తికి గాయాలు

ఖాజీపేట:నాగనాథీశ్వర కొండ దిగువన తెలుగుగంగ కాలువ గట్టుపై సోమవారం ఉదయం మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న ఇమాముల్‌ (56) అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి, చేతి నడివేలును పూర్తిగా కొరికేసింది. తీవ్ర రక్తస్రావమవుతున్నా ధైర్యం కోల్పోని ఇమాముల్‌.. పక్కనే ఉన్న రాయితో ఎలుగుబంటిపై తిరగబడ్డాడు. ఇంతలో వెనుక నుంచి వస్తున్న తోటి వాకర్స్‌ గమనించి గట్టిగా కేకలు వేస్తూ, రాళ్లు విసరడంతో ఎలుగుబంటి పంట పొలాల్లోకి పారిపోయింది. కాగా.. అడవికి ఆనుకుని ఉన్న పంట పొలాలకు వెళ్లేవారు, వాకర్స్‌ జాగ్రత్తగా ఉండాలని పత్తూరు బీట్‌ ఫారెస్ట్‌ అధికారి నాయక్‌ సూచించారు.

జిల్లాలో వర్షం

కడప అగ్రికల్చర్‌: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున జిల్లాలో పలు మండలాలల్లో వర్షం కురిసింది. ఇందులో బిమఠంలో 6.8 ఎంఎం, దువ్వూరులో 6.4 ఎంఎం, పెద్దముడియంలో 5.4 ఎంఎం, మైదుకూరు 3.4 ఎంఎం, బద్వేల్‌11.8 ఎంఎం వర్షం కురిసింది.

మెరిట్‌ జాబితా విడుదల

కడప ఎడ్యుకేషన్‌:జిల్లాలోని కేజీబీవీ ఉపాధ్యా య పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లావ్యాప్త ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితాను విడుదల చేసినట్లు సమగ్రశిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ అనురాధ తెలిపారు. వివరాలను htt p://kadapadoe.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగి న ఆధారాలతో ఈ నెల 12 లోపల httpr://kfbvrecruitment. apcfrr.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికై న అభ్యర్థులు ఈ నెల 13న కడప శంకరాపురంలోని ‘స్కౌట్‌ హాల్‌’ నందు అసలు సర్టిఫికేట్లతో హాజరుకావాలని ఆమె కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement