ఐక్యతతోనే సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

ఐక్యతతోనే సమస్యల పరిష్కారం

Aug 10 2026 12:46 AM | Updated on Aug 10 2026 12:46 AM

ఐక్యతతోనే సమస్యల పరిష్కారం

– అపుస్మా సమావేశంలో

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి

జమ్మలమడుగు రూరల్‌ : ప్రైవేట్‌ పాఠశాలల సమస్యలను పరిష్కరించుకునేందుకు ఐక్యతతో కృషి చేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి సూచించారు. అదివారం మండల పరిధిలోని గండికోటలో రాష్ట్రస్థాయి అపుస్మా సర్వసభ్య సమావేశాన్ని రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు రమణారెడ్డి, జమ్మలమడుగు అపుస్మా అధ్యక్షుడు బైరెడ్డి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. అపుస్మాలో ఒక ఎమ్మెల్సీ ఉన్నారంటే గర్వకారణమన్నారు. అపుస్మాలో పదవులు రాలేదని కాకుండా అపుస్మా కోసం తాము ఎంత వరకు ఉపయోగపడుతున్నామో గ్రహించాలని సూచించారు. రాష్ట్రంలో రికగ్నజైషన్‌ ఫైల్స్‌ దాదాపు 35 పెండింగ్‌లో ఉన్నాయని, ఇటీవల ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. విద్యా విధానం వేరు రాజకీయం వేరు అని చెపంపడం జరిగిందన్నారు. అపుస్మాలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారని గుర్తు చేశారు. కావున కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో అపుస్మా రాష్ట్ర అధ్యక్షుడు తులసి విష్ణు ప్రసాద్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమణ, చీఫ్‌ అడ్త్వజర్‌ పుల్లయ్య, జమ్మలమడుగు అపుస్మా నాయకులు చల్లపల్లి రమేష్‌రెడ్డి, రామిరెడ్డి, దస్తగిరి శేషారెడ్డి తదితరులు పాల్గోన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement