విద్యార్థి సంఘాల బంద్‌ ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి సంఘాల బంద్‌ ప్రశాంతం

Jul 25 2026 1:47 AM | Updated on Jul 25 2026 1:47 AM

కడప ఎడ్యుకేషన్‌/వైఎస్సార్‌ సర్కిల్‌ : నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్వహించిన జిల్లాలో నిర్వహించిన బంద్‌ ప్రశాంతంగా సాగింది. అయితే కడపలో ఒకటి రెండు చోట్ల విద్యార్థి సంఘ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కడపలో ఆర్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేసు, ఏఐఎస్‌బి రాష్ట్ర అధ్యక్షుడు సగిలి రాజేందప్రసాద్‌, పీఆర్‌ఎస్‌వైఎప్‌ రాష్ట్ర కన్వీనర్‌ కన్నెలూరు శంకర్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న, ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌, పిఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొడవటి నాగరాజు, ఏఎస్‌వైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఓబయ్య, టీటీఎన్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌, ఏఐబీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌రాథోడ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి, పీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడుల ఆధ్వర్యంలో బంద్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద శాంతియుతంగా ఆందోన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ చేయడం,బాష్పవాయువు ప్రయోగించడం హేయనీయమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement