బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతల స్వీకరణ

Jun 11 2026 12:25 AM | Updated on Jun 11 2026 12:25 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లా సర్వే, భూమి రికార్డుల కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా జే.భరత్‌ కుమార్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ శ్రీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో సర్వే, భూమి రికార్డుల నిర్వహణ, సేవల మెరుగుదల తదితర అంశాలపై చర్చించారు.

జెడ్పీలో నియామకాలు

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లా పరిషత్‌లో కారుణ్య నియామకాల కింద 22 మందికి జూనియర్‌ అసిస్టెంట్లుగా, ముగ్గురికి టైపిస్టులుగా ఉద్యోగాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను బుధవారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రామగోవిందరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జెడ్పీ ఉపాధ్యక్షుడు బాలయ్య, సీఈఓ సుబ్రమణ్యం, డిప్యూటీ సీఈఓ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో వర్షం

కడప అగ్రికల్చర్‌: రాష్ట్రంలోకి రుతు పవనాల ఆగమనంతో జిల్లాలో పలు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా కడపలో అత్యధికంగా 32.4 మి.మీ వర్షం కురిసింది. అలాగే ఒంటిమిట్ట మండలంలో 18.2, లింగాల, దువ్వూరు మండలాల్లో 5.2, సీకేదిన్నె మండలంలో 4.6 ముద్దనూరు మండలంలో 2.4, బద్వేల్‌ మండలంలో 1.2, గోపవరంలో 0.6 మి.మీ వర్షం కురిసింది.

దుప్పి మాంసాన్ని

పంచుకున్న ఇద్దరు అరెస్టు

మైదుకూరు : వనిపెంట అటవీ రేంజ్‌లోని గంగాయపల్లె బీట్‌లో చుక్కల దుప్పి మాంసాన్ని భాగాలు చేసి పంచుకున్న ఇద్దరిని బుధవారం అటవీ అధికారులు అరెస్టు చేశారు. మరో 8 మంది పరారయ్యారు. అటవీ రేంజ్‌ అధికారి చలపతి నాయుడు తెలిపిన వివరాల మేరకు.. గంగాయపల్లె బీట్‌లో బుధవారం ఉదయం ఓ చుక్కల దుప్పిపై కుక్కలు దాడి చేసి చంపాయి. మున్సిపాలిటీ పరిధిలోని చిన్నయ్యగారిపల్లెకు చెందిన పది మంది ఆ దుప్పిని కోసి భాగాలు వేస్తున్న విషయాన్ని వనిపెంట అటవీ అధికారులకు తెలిసింది. వారు దాడి చేయగా వెంకటసుబ్బయ్య, ప్రసాద్‌ దొరికారు. ఆరు కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు కేసు నమోదు చేశామని ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు.

డీప్యూటీ ఈఓ మీనాక్షిపై వేటు

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు ఉప విద్యాశాఖాధికారి మీనాక్షిపై రాజకీయ వేటు పడింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఇటీవల జరిగిన డీఆర్‌సీలో ఫిర్యాదు చేశా రు. ఈ నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తప్పించడంతో పాటు విద్యాశాఖ డైరెక్టరేట్‌లో రిపోర్టు చేసుకోవాలని విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement