కడప వైఎస్‌ఆర్ సర్కిల్: మన దినచర్యలో యోగా ఒక భాగంగా మారితే ఇంటిల్లిపాదికీ యోగానందం, ఆరోగ్య భాగ్యం సొంతమవుతుందని జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా పేర్కొన్నారు. యోగాంధ్ర పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం కడప వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కడప నగరపాలక సంస్థ, జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫ్యామిలీ యోగా’కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జూన్ 21న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘ఫ్యామిలీ యోగా’ కార్యక్రమానికి సుమారు 4 వేల మందికి పైగా హాజరై యోగాసనాలు వేయడం.. గర్వించదగ్గ విషయం అన్నారు. 16వ తేదీన గండికోట పర్యాటక క్షేత్రంలో నిర్వహించే ‘టూరిజం, హెరిటేజ్ యోగా’థీమ్ తో నిర్వహించే కార్యక్రమంలో జిల్లా ప్రజలు విశేషంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. యోగా సాధనతో మానసిక సమస్యలు, శారీరక రుగ్మతల నుంచి విముక్తితో పాటు మంచి జీవనశైలి కుడా అలవడుతుందన్నా రు. సబ్ కలెక్టర్, కడప నగర కమిషనర్ హెచ్.ఎస్. భావన మాట్లాడారు. కడప ఆర్‌డీఓ మురళి, ఎస్డీసి హరిప్రసాద్, జిల్లా పర్యాటక అధికారి సురేష్ కుమార్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజలక్ష్మి, జిల్లా ఆయుష్ నోడల్ అధికారి రవికుమార్, డీఎంహెచ్‌ఓ నాగరాజు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ నిధీ మీనా


