కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

కేసు నమోదు

Jun 11 2026 12:25 AM | Updated on Jun 11 2026 12:25 AM

ప్రొద్దుటూరు క్రైం : మహిళను వేధిస్తున్న వ్యక్తిపై బుధవారం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చాపాడు మండలంలోని రాజువారిపేటకు చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి తనతో మాట్లాడాలని ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లెకు చెందిన వివాహితను కొన్ని రోజులుగా వేధించేవాడు. తన వెంట పడొద్దని సదరు మహిళ పలుమార్లు చెప్పినా అతను వినిపించుకోలేదు. దీంతో మహిళ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు.

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

పుంగనూరు : మండల పరిధిలోని రాగానిపల్లెలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాగానిపల్లె గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి (67) అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడి మరణానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

మహిళకు పాము కాటు

మదనపల్లె టౌన్‌ : పొలం పనులు చేస్తున్న మహిళను విషసర్పం కాటేసిన సంఘటన బుధవారం పుంగనూరు మండలంలో జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పుంగనూరు మండలం ఈడిగపల్లె సమీపంలోని కురవూరుకు చెందిన రైతు ఏ. వెంకటరమణ భార్య ఏ. మునెమ్మ (60), ఊరికి సమీపంలోని తన వ్యవసాయ బోరు వద్ద టమోటా చెట్లలో కాయలు కోస్తోంది. ఆ సమయంలో చెట్ల మధ్య ఉన్న నాగుపాము మునెమ్మ కాలిపై కాటేసింది. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబీకులు బాధితురాలిని వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement