వెన్నుపోటుకు బాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ ! | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటుకు బాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ !

Jun 10 2026 1:43 AM | Updated on Jun 10 2026 1:43 AM

‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ సదస్సుల్లో వైఎస్సార్‌సీపీ నేతలు

కడప, కమలాపురం నియోజక

వర్గాల్లో నిరసన సదస్సులు

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసనలో భాగంగా కడపలో జరిగిన సదస్సులో నినదిస్తున్న వైఎస్సార్‌ సీపీ నేతలు సురేష్‌ బాబు, పాకా సురేష్‌, మాసీమబాబు తదితరులు

కమలాపురంలో నిరసన సదస్సులో మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ

కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నరేన్‌ రామాంజుల రెడ్డి

కడప కార్పొరేషన్‌: మోసం, అబద్ధాలు, వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ సీఎం చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్‌సీపీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కె. సురేష్‌ బాబు, కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్‌ రామాంజులరెడ్డి విమర్శించారు. మంగళవారం కడపలోని మున్సిపల్‌ మైదానం వద్దనున్న ఐఎంఏ హాలులో నల్ల కండువాలు ధరించి నిరసన తెలుపుతూ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ కడప నియోజకవర్గ పరిశీలకులు ఎస్‌. గురుమోహన్‌, మాజీ మేయర్‌ పాకా సురేష్‌ కుమార్‌, ఎస్‌ఈసీ సభ్యులు మాసీమ బాబు, యానాదయ్య, డాక్టర్‌ సొహైల్‌, ఎస్సీసెల్‌ స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పులి సునీల్‌ కుమార్‌, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఉమైర్‌, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్‌ బాబు మాట్లాడుతూ నమ్మించి వంచించడం చంద్రబాబుకు బాగా అలవాటన్నారు.

● కమలాపురం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్‌ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పార్టీ ఎస్‌ఈసీ సభ్యులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలయ్య, ఆరు మండలాల కన్వీనర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేన్‌ రామాంజులరెడ్డి మాట్లాడుతూ మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ప్రతిసారీ ఆయన అబద్ధాలతోనే అధికారంలోకి వస్తున్నారని, ప్రజలు ఇకనైనా మేల్కొనాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement