కడప కార్పొరేషన్/కోటిరెడ్డి సర్కిల్: జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం మాచునూరు, నందిమండలం, అలిదెన, పగిడాల పల్లె, జమాల్‌పల్లె, కొండపేటలో మట్టి, గ్రావెల్, నల్లమట్టి మాఫియా రెచ్చిపోతోందని బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్ల విలువైన మట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. రూ.కోట్లలో మట్టి, గ్రావెల్ తవ్వకాలు బహిరంగంగా జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ దందాను బీజేపీ తరఫున ఖండిస్తున్నామన్నారు. వెంటనే జిల్లా మైనింగ్ శాఖ స్పందించి, అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ చొరవ తీసుకొని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు
జంగిటి వెంకట సుబ్బారెడ్డి


