కడప కోటిరెడ్డిసర్కిల్: పగలంతా ఉక్కపోత... సాయంత్రానికి నల్ల మబ్బుల జాతర.. కాస్త పొద్దు వాలగానే ఒక్కసారిగా కుండపోత.. ఇదీ మంగళవారం కడపలో వాతావరణం. నల్లని మబ్బులన్నీ ఒక్కసారిగా కరిగిపోవడంతో కడప నగరం వర్షంలో తడిసి ముద్దయింది. ప్రధాన రహదారుల్లోనే వర్షపు నీరు వరదలా పారింది. సుమారు గంటపాటు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎన్జీఓ కాలనీ, మృత్యుంజయకుంట, అప్సర సర్కిల్, చిన్నచౌకు తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. మొత్తం మీద ఓ మోస్తరు వర్షం కారణంగా నగర వాసులకు తిప్పలు తప్పలేదు.
కడపలో మురికి నీటితో కలిసి రోడ్డుపై పారుతున్న వర్షపునీరు


