స్మార్ట్‌ కిచెన్‌లతో ఆరోగ్యానికి భరోసా | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ కిచెన్‌లతో ఆరోగ్యానికి భరోసా

Jun 10 2026 1:43 AM | Updated on Jun 10 2026 1:43 AM

– కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి శుభ్రమైన,సురక్షితమైన, పోషక విలువలు కలిగిన వేడివేడి భోజనం అందించడమే స్మార్ట్‌ కిచెన్‌ల ప్రధాన లక్ష్యమని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో స్మార్ట్‌ కిచెన్ల నిర్వహణపై సంబంధిత స్టేక్‌ హోల్డర్స్‌ కు అవగాహన పెంచే ఒక్కరోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పలు కీలక మార్గదర్శకాలను వెల్లడించారు. స్మార్ట్‌ కిచెన్‌ నిర్వహణ బాధ్యతలను మహిళా మండల సమాఖ్య సభ్యులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ నిధి మీనా, డీఈఓ షంషుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement