దగా డీఎస్సీపై సీబీఐ విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

దగా డీఎస్సీపై సీబీఐ విచారణ చేపట్టాలి

Jun 9 2026 5:48 AM | Updated on Jun 9 2026 5:48 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : డీఎస్సీలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పులి సునీల్‌కుమార్‌, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాయకుడు సీహెచ్‌ వినోద్‌కుమార్‌లు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. డీఎస్సీ ఎలిజబుల్‌, మెరిట్‌ జాబితాలో ఉన్న వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జరిగిన అవకతవకలపై తక్షణమే సీబీఐ విచారణ నిర్వహించాలన్నారు. ఇందుకు బాధ్యులైన మంత్రి లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. 1:1 నిష్పత్తి మేరకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్‌ కోటాలో అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు అంటే మోసమని, అదే బాటలో ఆయన తనయుడు లోకేష్‌ కూడా వెళుతున్నారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి అర్హులందరికీ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ నాయకులు త్యాగరాజు, బాబు, రవి, పెంచలయ్య, ప్రభుదాసు, రత్నకుమారి, మరియలు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ ఆందోళన

Advertisement
 
Advertisement
Advertisement