ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

Jun 8 2026 7:12 AM | Updated on Jun 8 2026 7:12 AM

కడప అర్బన్‌ : ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ హెచ్చరించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 146 కేసులు నమోదు చేసి, రూ. 38,710 జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌, కార్లలో వెళ్లే వారు సీట్‌ బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు. రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌

Advertisement
 
Advertisement
Advertisement