కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ’డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు.
సర్కిల్ స్థాయిలోనూ డయల్ యువర్ ఎస్‌ఈ
డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతోపాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ’డయల్ యువర్ ఎస్‌ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వినియోగదారులు 08562242457 నంబర్‌కు ఫోన్ చేయాల్సి ఉంటుంది.
కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలి
డీఆర్వో మల్లికార్జునుడు
కడప సెవెన్‌రోడ్స్ : కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే కాల్ సెంటర్, ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు వినియోగించుకోవాలని డీఆర్‌ఓ మల్లికార్జునుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకుసంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు.
● కలెక్టరేట్‌లోని సభా భవన్‌లో సోమవారం ప్రజాసమస్యలపరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్‌ఎస్) కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నట్లు డీఆర్‌ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పును తీసుకురావాలని డీఆర్‌వో సూచించారు.
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి ఉదయం 10.00 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562 –244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవాలని సూచించారు.
క్రీడలతో ఆరోగ్యం పదిలం
మదనపల్లె సిటీ : క్రీడలతో మానసికోల్లాసం, మెరుగైన ఆరోగ్యం పొందొచ్చని డీఎస్‌డీఓ చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం మదనపల్లెలోని బీటీ కాలేజీ మైదానంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం పురస్కరించుకుని ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు, సైక్లింగ్ వల్ల ఆరోగ్య పరిరక్షణ, శారీరక దృఢత్వం, పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు వంటి ప్రయోజనాలు ఉంటాయన్నారు.సైక్లింగ్‌ను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో రిటైర్డు డీఎస్‌డీఓ సయ్యద్‌బాషా, కోచ్‌లు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీరెడ్డెమ్మకొండలో
భక్తుల రద్దీ
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. పలువురు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లీంలు ఆలయానికి తరలివచ్చారు. రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.


