సిద్దవటం : మూడు రోజుల్లోగా 95 శాతం ఎస్‌ఐఆర్ పూర్తి చేయాలని రాజంపేట సబ్ కలెక్టర్ భావన అధికారులను ఆదేవించారు. సిద్దవటం మండలంలోని పెద్దపల్లి గ్రామ పంచాయతీ శివునిపల్లి గ్రామంలో ఆదివారం సబ్ కలెక్టర్ బీఎల్‌ఓలు ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ చేస్తున్నారా లేదా అని క్షేత్రస్థాయిలో ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. సిద్దవటం మండలంలో ఇప్పటి వరకు 62.5 శాతం మ్యాపింగ్ పూర్తయిందని తహసీల్దార్ విజయ్‌కుమార్ సబ్ కలెక్టర్‌కు వివరించారు.
కిచెన్ షెడ్డును త్వరగా పూర్తి చేయాలి
మండల కేంద్రమైన సిద్దవటంలో నిర్మిస్తున్న కిచెన్‌షెడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని రాజంపేట సబ్ కలెక్టర్ భావన కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సిద్దవటం జెడ్పీ ఉన్నత పాఠశాల పక్కన నిర్మిస్తున్న కిచెన్ షెడ్ నిర్మాణ పనులను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కిచెన్ షెడ్‌లను నిర్మిస్తోందన్నారు. కిచెన్ షెడ్‌ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అప్పగించాలని ఆదేశించారు.
రాజంపేట సబ్ కలెక్టర్ భావన


