విచ్చలవిడి దోపిడీ.. | - | Sakshi
Sakshi News home page

విచ్చలవిడి దోపిడీ..

Jun 8 2026 7:12 AM | Updated on Jun 8 2026 7:12 AM

ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలనే ఆశతో ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూల్స్‌పైపు అడుగు లేస్తున్నారు. అదే అదునుగా భావించిన కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ యాజమాన్యాలు తల్లిదండ్రుల చెవులు పిండి ‘క్యాస్‌’ చేసుకుంటున్నాయి. అడ్మిషన్‌ టెస్టుల నుంచే దోపిడీ పర్వం మొదలుపెట్టాయి. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు మొదలుకొని యూనిఫాం, టై, బెల్ట్‌, షూ వంటి వాటిని తమ పాఠశాలలో ఏర్పాటు చేసుకుని బహిరంగ మార్కెట్‌ ధరలకంటే అధిక రేట్లతో విక్రయాలు చేస్తూ సొమ్ము చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాలపై పలువురు విద్యార్థి సంఘ నాయకులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారే విమర్శలు మెండుగా వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement