ఆహార శుభ్రత.. ఆరోగ్య భద్రత | - | Sakshi
Sakshi News home page

ఆహార శుభ్రత.. ఆరోగ్య భద్రత

Jun 8 2026 7:12 AM | Updated on Jun 8 2026 7:12 AM

ఆహార శుభ్రత.. ఆరోగ్య భద్రత

కడప ఎడ్యుకేషన్‌ : ప్రతి ఒక్కరూ ఆహారం సురక్షితంగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ వినయ్‌కుమార్‌ సూచించారు. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం’పై ఆదివారం కడపలోని గాంధీనగర్‌ హైస్కూల్‌లో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ న్యాయవాదులతో న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వినయ్‌ కుమార్‌ మాట్లాడుతూ కలుషిత ఆహారం తినడం వల్ల పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా చేతులు కడుక్కోవాలన్నారు. బయటి ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. పాడైన లేదా కాలం తీరిన ఆహారం తీసుకోకూడదు సూచించారు. అలాగే లీగల్‌ సర్వీసెస్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 15100, చైల్డ్‌ లైన్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1098, ఉచిత న్యాయ సాయం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ వారి దృష్టికి తీసుకొని రావచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆహార భద్రతా అధికారులు హరిత, రమేష్‌ కుమార్‌రెడ్డి, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్స్‌ చంద్రకాంతమ్మ, సంత, ప్రవీణ్‌, కడప మండలంలోని హోటల్స్‌ సిబ్బంది, పార లీగల్‌ వాలంటీర్స్‌ దశరథరామిరెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement